పరిశుభ్రత అనేది ప్రజల జీవనంలో భాగం కావాలి: సీఎం చంద్రబాబు పిలుపు

రిపోర్టర్: కిరణ్ స్థలం: విజయవాడ

పరిశుభ్రత అనేది ప్రజల జీవనంలో భాగం కావాలని, కేవలం ప్రభుత్వ బాధ్యత అనుకునే ధోరణి మారాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విజయవాడలో జరిగిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టించే విధానాలను అమలు చేస్తున్నామని, శుభ్రత విషయంలో సామాజిక బాధ్యత ఎంతో అవసరమని సీఎం స్పష్టం చేశారు.