ట్రంప్ కొత్త వివాదం: తాను షేర్ చేసిన వీడియోనే గుర్తుపట్టలేదు!

రిపోర్టర్: సునీల్ స్థలం: World

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో కేవలం రెండు రోజుల క్రితం రీపోస్ట్ చేసిన వివాదాస్పద జనవరి 6 వీడియోను గుర్తించలేకపోయారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో ఓ రిపోర్టర్ దీని గురించి ప్రశ్నించగా 'ఎవరు?' అంటూ ట్రంప్ ఆశ్చర్యపోవడం నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. ఆయన బహిరంగ ప్రవర్తనపై మరోసారి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.