ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు భారీ ట్రాఫిక్ ఆంక్షలు

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో ఐదు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టగా, ఆరు ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. భక్తులు మరియు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకుని పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.