విదేశీ నిధులు మరియు మావోయిస్టుల వ్యాఖ్యలపై ప్రశ్నా రావణ్ విచారణ

రిపోర్టర్: మహేష్ స్థలం: గన్నవరం

విదేశీ నిధుల ప్రవాహం మరియు మావోయిస్టులకు అనుకూల వ్యాఖ్యల కేసులో యూట్యూబర్ ప్రశ్న రావణ్‌ను గన్నవరం పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. శనివారం డీఎస్పీ కార్యాలయంలో ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించగా, విదేశాల నుంచి వచ్చిన నిధులు మరియు మావోయిస్టుల భావజాలాన్ని ప్రచారం చేయడంపై పోలీసుల ప్రశ్నలకు ఆయన దాటవేత సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం.