కివీస్ తో వన్డే సిరీస్: భారత జట్టులో కీలక మార్పులపై శుభమన్ గిల్ ప్రకటన
రిపోర్టర్: రమేష్
స్థలం: Auckland
న్యూజిలాండ్ తో జరిగే ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్ లో మిడిలార్డర్ కోసం ఫ్లెక్సిబుల్ విధానాన్ని అనుసరిస్తామని భారత జట్టు కెప్టెన్ శుభమన్ గిల్ వెల్లడించారు. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఐదు మరియు ఆరు స్థానాల్ లో అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతారని ఆయన స్పష్టం చేశారు. అలాగే తన మెడ నొప్పికీ సంబంధించిన సమస్య పూర్తిగా తగ్గిపోయిందని, నెట్ప్రాక్టీస్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్, ఫీల్డింగ్ పూర్తి చేశానని శుభమన్ గిల్ తెలిపారు.