అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాల్య ఇల్లు 1.93 మిలియన్ డాలర్లకు విక్రయం.

రిపోర్టర్: సునీల్ స్థలం: New York

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన బాల్యంలో నివసించిన క్వీన్స్ ప్రాంతంలోని చారిత్రాత్మక ఇల్లు 1.93 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది. న్యూయార్క్‌లోని జమైకా ఎస్టేట్స్‌లో ఉన్న ఈ ట్యూడర్-శైలి భవనాన్ని గతంలో డెవలపర్ టామీ లిన్ కొనుగోలు చేసి ఆధునీకరించారు. ట్రంప్‌తో ఉన్న అనుబంధం కారణంగా ఈ ఆస్తికి భారీ డిమాండ్ ఏర్పడింది.