చిట్వేల్: వైభవంగా స్వామివారి కల్యాణ మహోత్సవం
రిపోర్టర్: k. siva prasad
స్థలం: చిట్వేల్
తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం దేవమాచుపల్లి పరిధిలో ఉప సర్పంచ్ ఎల్వీ మోహన్ రెడ్డి నూతన ఆలయాన్ని నిర్మించి, విగ్రహ ప్రతిష్ఠ చేయించారు. సోమవారం ఆలయంలో స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
మంగళ వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలు, తాళిబొట్టును భక్తులు ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ నిర్మాణంలో మోహన్ రెడ్డి చొరవపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.