దసరా పండుగ వేళ హై అలర్ట్: ఇళ్ల భద్రతపై పోలీసుల కీలక హెచ్చరిక
రిపోర్టర్: నరేష్
స్థలం: తెలంగాణ
దసరా పండుగ సెలవుల్లో సొంతూళ్లకు వెళ్లే ప్రజలు ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఖాళీ ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు జరిగే ప్రమాదముందని అధికారులు తెలిపారు. విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని, సోషల్ మీడియాలో ప్రయాణ వివరాలు పోస్ట్ చేయవద్దని స్పష్టం చేశారు. ఎవరికైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.