స్మార్ట్‌వాచ్ హెచ్చరికలను గుడ్డిగా నమ్మవద్దని కార్డియాలజిస్ట్ డాక్టర్ వివేక కుమార్ హెచ్చరిక
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: న్యూఢిల్లీ
స్మార్ట్‌వాచ్‌లు హృదయ స్పందనను పర్యవేక్షించడంలో ఉపయోగపడినప్పటికీ, వాటిని వైద్య పరీక్షలకు ప్రత్యామ్నాయంగా భావించకూడదని మాక్స్ ఆసుపత్రి కార్డియాలజీ విభాగం చైర్మన్ డాక్టర్ వివేక కుమార్ స్పష్టం చేశారు. వాచ్ ఇచ్చే హెచ్చరికలు కేవలం ముందస్తు సంకేతాలు మాత్రమేనని, గుండెపోటును లేదా రక్తనాళాల లను ఇవి పూర్తిగా నిర్ధారించలేవని ఆయన తెలిపారు. సాధారణ రీడింగ్‌లు వచ్చినంత మాత్రాన గుండె ఆరోగ్యంగా ఉందని నిర్ధారణకు రాకూడదని, సమస్య ఉంటే క్లినికల్ పరీక్షలు తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు.