జార్జియాలో భారతీయ అమెరికన్ల సమావేశం: విద్యా మండలి ప్రతినిధితో కీలక చర్చలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: జార్జియా

అమెరికాలోని జార్జియాలో విద్యార్థులు, కుటుంబాల సంక్షేమంపై చర్చించేందుకు భారతీయ అమెరికన్ సభ్యులు ఫోర్సైత్ కౌంటీ విద్యా మండలి 5వ జిల్లా ప్రతినిధి మైక్ వాల్డెస్తో సమావేశమయ్యారని నిర్వాహకులు తెలిపారు. పాఠశాల సౌకర్యాల వినియోగం, భద్రత, కృత్రిమ మేధ పాత్ర, మానసిక ఆరోగ్యంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. వాల్డెస్ పునరెన్నికకు సభ్యులు మద్దతు ప్రకటించారని, బహుభాషా విద్యను ప్రోత్సహించాలని కోరారని పేర్కొన్నారు.