పశ్చిమ గోదావరిలో విషాదం: గోదావరిలోకి దూకిన కుటుంబం, భార్య రక్షణ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: పశ్చిమ గోదావరి

పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి చించినాడ బ్రిడ్జి వద్ద దారుణం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరి నదిలోకి దూకారు. స్థానిక జాలర్లు వెంటనే స్పందించి వివాహితను కాపాడారు. భర్త, ఇద్దరు పిల్లల కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వరుస ఘటనలతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.