గ్రేటర్ నోయిడాలో నలుగురిని ఢీకొన్న కారు డ్రైవర్ అరెస్ట్
రిపోర్టర్: విజయ్
స్థలం: Noida
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడాలోని నాలెడ్జ్ పార్క్ ప్రాంతంలో సెప్టెంబర్ 18న వేగంగా దూసుకొచ్చిన ఒక కారు నలుగురు వ్యక్తులను ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, కారును స్వాధీనం చేసుకుని నిందితుడు మనీష్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు.