దీపావళి టపాసుల లైసెన్సు దరఖాస్తు గడువు కుదింపు: సైబరాబాద్ పోలీస్ కమిషనర్

రిపోర్టర్: రాజేష్ స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి

దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలికంగా టపాసుల విక్రయం మరియు నిల్వ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునే గడువును మారుస్తూ Cyberabad Police కీలక ప్రకటన విడుదల చేశారు. నవంబర్ ఏడవ తేదీ వరకు ఉన్న గడువును నవంబర్ నాలుగవ తేదీ వరకు కుదిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వ్యాపారులు ఆన్లైన్ ద్వారా మాత్రమే నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.