చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం: మంత్రి డ్రైవర్ దుర్మరణం

రిపోర్టర్: మహేష్ స్థలం: పల్నాడు

పల్నాడు జిల్లా చిలకలూరిపేట పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యక్తిగత డ్రైవర్ తన్నీరు శ్రీహరి దుర్మరణం పాలయ్యారని పోలీసులు తెలిపారు. బైక్పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన శ్రీహరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ అకాల మరణం పట్ల మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.