అన్నదాతల ఆక్రోశం: ఎల్నినో ప్రభావంతో ఉమ్మడి తూర్పు గోదావరిలో దెబ్బతిన్న సీతాఫలం సాగు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: East Godavari
ఎల్నినో ప్రభావం కారణంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సీతాఫలం సాగు పూర్తిగా దెబ్బతిన్నదని, సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంట దిగుబడి పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని స్థానిక అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. అసాధారణంగా పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల పూత దశలోనే మొక్కలు నాశనమయ్యాయని, సాగు ఖర్చులు విపరీతంగా పెరిగినప్పటికీ సరైన దిగుబడి రాక తాము ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నామని వాపోయారు.