కెసిఆర్ పాలనలోనే తండాలు అన్ని రంగాల్లో అభివృద్ధి
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండలంలోని పుట్టగూడెం గ్రామంలో గురువారం జలసాధన సమితి కన్వీనర్ ఎర్రగోకుల జస్వంత్ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో తండాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను, ప్రస్తుత పథకాలను ఆయన ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ ఉపాధ్యక్షులు గుంటి మధుసూదన్ రెడ్డి, రాములు నాయక్, గన్యా నాయక్, లక్ష్మనాయక్, ఉపసర్పంచ్ లక్ష్మణ్ నాయక్, మాజీ సర్పంచ్లు దేవీనాయక్, మడవత రాణి తదితరులు పాల్గొన్నారు.