విడాకులు పొందిన కూతురికి కుటుంబ పింఛన్ ఇవ్వాల్సిందే: త్రిపుర హైకోర్టు

రిపోర్టర్: హరి స్థలం: త్రిపుర

తండ్రి మరణించే నాటికి విడాకులు తీసుకోలేదన్న కారణంగా కూతురికి కుటుంబ పింఛన్ను నిరాకరించలేమని త్రిపుర హైకోర్టు స్పష్టం చేసింది. విడాకులు పొందిన తేదీ నుంచే పింఛన్ మంజూరు చేయాలని అగర్తల మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆదేశించింది. చట్టంలో లేని నిబంధనలను అన్వయించి హక్కును కోల్పోజేయలేమని తేల్చిచెప్పింది.