మహాకవి గురజాడ అప్పారావు జయంతికి జనసేన ఘన నివాళి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Andhra Pradesh
తెలుగు సాహిత్యంలో విప్లవం తీసుకొచ్చిన మహాకవి గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా జనసేన పార్టీ ఘన నివాళులు అర్పించింది. బాల్య వివాహాలు, వృద్ధ వివాహాలు, వేశ్యా వ్యవస్థ వంటి సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా తన రచనల ద్వారా సమాజంలో చైతన్యం నింపిన విప్లవాత్మక, అభ్యుదయ సాహిత్యకారుడిగా గురజాడ సేవలను పార్టీ స్మరించుకుంది.