వలిగొండలో వినాయక పూజలు నిర్వహించిన మాజీ జెడ్పిటిసి పద్మా అనంతరెడ్డి

రిపోర్టర్: BALUGURI VENKHATAREDDY స్థలం: వలిగొండ

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో వినాయక మండపం వద్ద మాజీ జడ్పిటిసి వాకిటి పద్మా అనంతరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని, పాడిపంటలు సమృద్ధిగా పండి రైతుల కళ్ళల్లో ఆనందం నిండాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం భక్తులకు పులిహోర ప్రసాదం అందజేశారు.