సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేసిన ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు
రిపోర్టర్: గోపి
స్థలం: సిద్దిపేట
సిరిసిల్ల గడ్డపై నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయడంపై మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు పూర్తిగా అనుగుణంగా ప్రజాపాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని అలాగే సంక్షేమాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.