కేసీఆర్ భూములు లాక్కున్నారనేది పచ్చి అబద్ధమంటూ ఎర్రవల్లి రైతుల ఆగ్రహం

రిపోర్టర్: మహేష్ స్థలం: సిద్దిపేట

సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం ఎర్రవల్లిలో కేసీఆర్ భూములు తీసుకున్నారంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దళిత రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్లూరప్పలు ఉన్న భూమిని కేసీఆర్ పచ్చని పొలాలుగా మార్చారని, సర్వే పేరుతో వస్తే ఊరుకోమని హెచ్చరించారు. గురువారం సర్వేకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు.