అమెరికాలో కేఏ పాల్ ఆధ్వర్యంలో గ్లోబల్ పీస్ అండ్ ప్రేయర్ మీటింగ్
రిపోర్టర్: గోపి
స్థలం: టెక్సాస్
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం లూయిస్విల్లే వేదికగా అక్టోబర్ 25వ తేదీన గ్లోబల్ పీస్ అండ్ ప్రేయర్ మీటింగ్ నిర్వహించనున్నట్లు గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ ప్రెసిడెంట్ డాక్టర్ కేఏ పాల్ వెల్లడించారు. ఈ కార్యక్రమం శాంతి, నిరీక్షణ, ప్రార్థనతో పాటు ఇమ్మిగ్రేషన్ సమస్యలు ఎదుర్కొంటున్న కుటుంబాలకు మద్దతుగా నిలవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినట్లు ఆయన అనుచరులు తెలిపారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన సదస్సు ముగింపు వెంటనే ఈ కార్యక్రమం కొనసాగుతోంది.