అమెరికాలో సెనేట్ ఎన్నికల హీట్: రిపబ్లికన్ ప్రత్యర్థిపై అబ్దుల్ ఎల్-సయేద్ సెటైర్లు

రిపోర్టర్: రాజేష్ స్థలం: Michigan

అమెరికాలోని మిషిగన్ సెనేట్ ఎన్నికల్ లో డెమోక్రటిక్ అభ్యర్థి అబ్దుల్ ఎల్-సయేద్ తన రాజకీయ ప్రత్యర్థి అయిన రిపబ్లికన్ నేత మైక్ రోజర్స్ పై తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించినట్లు రాజకీయ విశ్లేషకులు తెలిపారు. మైక్ రోజర్స్ నిర్వహించిన ఎన్నికల సభకు జనం ఎంతమంది హాజరయ్యారంటూ ఆయన ఎద్దేవా చేశారు. ప్రచార వేదికలపై రోజర్స్ అనుసరిస్తున్న తీరును తప్పుపడుతూ అబ్దుల్ ఎల్-సయేద్ విమర్శలు గుప్పించారని, నవంబర్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరిందని వారు పేర్కొన్నారు.