యూట్యూబర్ అజిత్ భారతి ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణ

రిపోర్టర్: వెంకట్ స్థలం: New Delhi

యూట్యూబర్ అజిత్ భారతికి కోర్టులో ఊరట లభించలేదు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదైన కేసులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. సోషల్ మీడియాలో వివాదాస్పద వీడియో పోస్ట్ చేసిన వ్యవహారంలో ఆయనపై కేసు నమోదైంది. కుల దూషణల వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. కోర్టు ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది.