మొహ్సిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి భారత మహిళా జట్టు నిరాకరణ

రిపోర్టర్: హరి స్థలం: Dubai

దుబాయ్‌లో జరిగిన మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి టైటిల్ గెలుచుకున్న భారత జట్టు, పీసీబీ చీఫ్, ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి నిరాకరించింది. గత ఏడాది పురుషుల ఆసియా కప్‌లోనూ ఇలాగే జరగడం వివాదాస్పదమైంది. నక్వీ ప్రభుత్వ పదవిలో ఉంటూ క్రికెట్ బోర్డును నిర్వహించడంపై మాజీ క్రికెటర్ మొహ్సిద్ కైఫ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.