తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌గా ముకుల్ వాస్నిక్ రేసులో ముందంజ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తెలంగాణ
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ లండన్ పర్యటనకు వెళ్లనుండటంతో ఆ స్థానాన్ని భర్తీ చేయడంపై హైకమాండ్ కసరత్తు చేస్తోంది. రేవంత్ రెడ్డి వర్గానికి, సీనియర్ నాయకులకు మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు, వర్గపోరును చక్కదిద్దేందుకు సీనియర్ నేత ముకుల్ వాస్నిక్ పేరు ప్రముఖంగా పరిశీలనలో ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వివాదరహితుడైన వాస్నిక్ నియామకంపై త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.