మహిళలకు భారీ ఊరట: ఆర్టీసి బస్సుల్లో అపూర్వంగా పెరిగిన ప్రయాణికుల రద్దీ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తెలంగాణ

మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఎంతో సౌకర్యంగా మారిందని ఆర్టీసి ఎండీ నాగిరెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకానికి అపూర్వ స్పందన లభిస్తోందని, గత మూడు నెలల్లో అదనంగా తొంబై ఏడు లక్షలకు పైగా మంది మహిళలు ప్రయాణించినట్లు ఆయన స్పష్టం చేశారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని డిమాండ్ ఉన్న మార్గాలలో ట్రిప్పుల సంఖ్యను పెంచాలని అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.