మహారాష్ట్రలో వివిధ గ్రూప్స్ ప్రధాన పరీక్షలు వాయిదా

రిపోర్టర్: మహేష్ స్థలం: Mumbai

అక్టోబర్ 3 నుండి ప్రారంభం కావాల్సిన మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టేట్ సర్వీసెస్ మెయిన్ పరీక్షతో పాటు సివిల్ ఇంజనీరింగ్ మరియు గ్రూప్-బి మెయిన్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఎంపీఎస్సీ అధికారులు తెలిపారు. అభ్యర్థులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే 2025 పరీక్షల జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయనున్నట్లు పేర్కొన్నారు.