పాపిరెడ్డిపల్లిలో పశువుల షెడ్ల నిర్మాణానికి భూమిపూజ చేసిన నేతలు

రిపోర్టర్: కస్తూరి సురేష్ స్థలం: ఓబులవారిపల్లి

ఓబులవారిపల్లి మండలం పాపిరెడ్డిపల్లిలో పల్లె పండుగ–3.0లో భాగంగా రెండు పశువుల షెడ్ల నిర్మాణానికి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ముక్కా రూపానంద రెడ్డి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ భూమిపూజ చేశారు. పశుపోషణకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.