హోమ్ బయర్లకు భారీ షాక్: చట్టాన్ని మార్చాలని ప్రధానికి విజ్ఞప్తి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: న్యూఢిల్లీ
రియల్ ఎస్టేట్ చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకొని రావాలని ప్రధాని నరేంద్ర మోదీని ఫోరం ఫర్ పీపుల్స్ కలెక్టివ్ ఎఫర్ట్స్ సంస్థ కోరిందని అసోసియేషన్ తెలిపింది. దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ప్రాజెక్ట్ లలో లక్షల కోట్ల రూపాయలు చిక్కుకుపోయాయని, కోట్లాది మంది కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. రెరా చట్టం అమలులో తీవ్ర లోపాలు ఉన్నాయని సంస్థ పేర్కొంది.