ఫౌజీ సినిమాలో చరిత్ర వక్రీకరణ: దర్శకుడు క్షమాపణలు చెప్పాలని చంద్రకుమార్ డిమాండ్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: న్యూఢిల్లీ
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్రకుమార్ బోస్ తాజా చిత్రం ఫౌజీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతాజీ అడాల్ఫ్ హిట్లర్ భేటీని చిత్రంలో తప్పుగా చూపించి చరిత్రను వక్రీకరించారని ఆయన మండిపడ్డారు. జాతీయ నాయకులపై కల్పితాలు సృష్టించడం నేరమని పేర్కొంటూ, దేశ ప్రజలకు దర్శకుడు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని చంద్రకుమార్ బోస్ డిమాండ్ చేశారని ఏజెన్సీ వార్తలు వెల్లడించాయి.