గంజాయి అక్రమ రవాణా భగ్నం: పెదబయలులో ముగ్గురు నిందితుల అరెస్ట్
రిపోర్టర్: Thrinadh Rudi
స్థలం: పెదబయలు
అల్లూరి జిల్లా పెదబయలు మండలం సికరి పంచాయతీ పన్నెడా జంక్షన్ వద్ద శనివారం పోలీసులు జరిపిన వాహనాల తనిఖీలలో ఇరవై ఐదు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం తరలించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ పన్నెఆప లక్షల యాభై వేల రూపాయలుగా అంచనా వేయగా, పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.