ఒలింపిక్స్ ఛాంపియన్ సిమోన్ బైల్స్: అనాథ పిల్లలకు అండగా అథ్లెట్ సేవలు

రిపోర్టర్: విజయ్ స్థలం: టెక్సాస్

తమ బాల్యంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న పిల్లలకు అండగా నిలవడంలో ప్రముఖ ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్ సిమోన్ బైల్స్ ఎప్పుడూ ముందుంటారని ఆమె సన్నిహితులు తెలిపారు. తాను కూడా ఒకప్పుడు ఫోస్టర్ కేర్ లో పెరిగానని, ఆ బాధ ఎలాంటిదో తనకు బాగా తెలుసని సిమోన్ బైల్స్ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు దీర్ఘకాలికంగా మెంటార్ షిప్ అందిస్తున్న ఫ్రెంట్స్ ఆఫ్ ది చిల్డ్రన్ అనే స్వచ్ఛంద సంస్థకు అథ్లెట్ సిమోన్ బైల్స్ నిరంతరం మద్దతుగా నిలుస్తున్నారు.