సిరిసిల్ల నేతన్నలకు గత బకాయిలు చెల్లించామన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రిపోర్టర్: విజయ్ స్థలం: राजన్న సిరిసిల్ల

సిరిసిల్ల బహిరంగ సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, గత పాలకులు నేతన్నలకు చెల్లించాల్సిన సుమారు ఐదు వందల కోట్ల బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. వేములవాడలో యాభై కోట్లతో నూలు డిపో ఏర్పాటు చేశామని, నేతన్నలకు ఏడాది పొడవునా చేతినిండా పని కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం లక్ష కోట్లు ఖర్చు చేసిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.