ఉపాధి కల్పనలో రాష్ట్రం అగ్రస్థానం: నైపుణ్యాభివృద్ధి విభాగంపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష

రిపోర్టర్: రాము స్థలం: అమరావతి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న నైపుణ్య శిక్షణ ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. ఉండవల్లి నివాసంలో నైపుణ్యాభివృద్ధి విభాగంపై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఉపాధి కల్పన రేటులో జాతీయ సగటు అరవై నాలుగు శాతం ఉంటే, రాష్ట్ర సగటు ఆరు శాతంగా ఉండి దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో నిలిచిందని నారా లోకేశ్ వెల్లడించారు.