అన్నపూర్ణ స్టూడియోస్‌లో సీడ్ గణేశుడిని స్వీకరించిన హీరో నాగార్జున

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బృందం అందించిన పర్యావరణహిత సీడ్ గణేశుడి విగ్రహాన్ని సినీ హీరో అక్కినేని నాగార్జున స్వీకరించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా సహజ సిద్ధమైన మట్టి, విత్తనాలతో తయారు చేసిన ఈ విగ్రహాన్ని పూజ అనంతరం ఇంట్లోనే నిమజ్జనం చేయడం ద్వారా మొక్కలు మొలకెత్తుతాయని, ఇది పర్యావరణ పరిరక్షణకు గొప్ప మార్గమని ఆయన ప్రశంసించారు.