గ్రీన్ గ్రోత్ వైపు అడుగులు వేయాలని సీఎం చంద్రబాబు పిలుపు

రిపోర్టర్: అశోక్ స్థలం: బెంగళూరు

పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ప్రకృతితో మమేకమయ్యే గ్రీన్ గ్రోత్ వైపు అడుగులు వేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో విస్టా స్పేసెస్ సంస్థ నిర్మించిన ద ఎర్త్‌ సెంటర్‌ భవనాన్ని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంక్రీట్ అడవులుగా మారుతున్న నగరాల్లో పర్యావరణ అనుకూల భవనాల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.