మత్స్యకారుల కుటుంబాలకు యాభై కిలోల బియ్యం పంపిణీకి ఆదేశం

రిపోర్టర్: శివ స్థలం: అమరావతి

తీవ్రవాయుగుండం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముంపు ప్రాంతాల్లో చేపడుతున్న పునరావాస చర్యలను ఆయన సమీక్షించారు. ఐదు రోజులుగా వేటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకారుల కుటుంబాలకు యాభై కేజీల బియ్యం అందజేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే ప్రకాశం బ్యారేజీ ఎగువ, దిగువన మరో రెండు కొత్త బ్యారేజీల నిర్మాణానికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని స్పష్టం చేశారు.