తుపాను ధాటికి కాఫీ పంట నేలమట్టం కావడంతో రైతు ఆక్రోశం

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: జి.కె.వీధి

అల్లూరి జిల్లా జీకే వీధి మండలం రింతాడ పంచాయతీ నూతిబంద గ్రామంలో అర్నబ్ తుపాను ప్రభావంతో రైతు సోమ్మెల నీలంరాజుకు చెందిన కాఫీ తోట తీవ్రంగా దెబ్బతిన్నది. భారీ ఈదురుగాలులకు కాఫీ చెట్లు నేలకూలడంతోపాటు మిరియాల పంట కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రకృతి విపత్తు వల్ల సర్వస్వం కోల్పోయిన తమను ప్రభుత్వం వెంటనే ఆదుకుని తగిన నష్టపరిహారం అందించాలని బాధితుడు ఆవేదనతో కోరారు.