దళిత బంధు నిధులు వెంటనే విడుదల చేయాలంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్
రిపోర్టర్: హరి
స్థలం: కరీంనగర్
హుజూరాబాద్ నియోజకవర్గానికి రూ.1,000 కోట్ల అభివృద్ధి నిధులతో పాటు దళిత బంధు రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలని పాడి కౌశిక్ రెడ్డి - ఎమ్మెల్యే హుజూరాబాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలో నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజా సంక్షేమ పథకాలను నిలిపివేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెండింగ్ నిధులను మంజూరు చేసి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలని ఆయన స్పష్టం చేశారు.