ట్రంప్ సుంకాల ఒత్తిడిపై కెనడా గట్టి కౌంటర్!
రిపోర్టర్: నరేష్
స్థలం: World
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ఒత్తిడిని ఎదుర్కొనేందుకు కెనడా ధీటైన ఆర్థిక వ్యూహాన్ని ప్రకటించింది. కెనడియన్ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని పిలుపునిచ్చిన మార్క్ కార్నీ, దేశ భవిష్యత్తును మనమే నియంత్రిస్తున్నామని స్పష్టం చేశారు. ట్రంప్ MAGA వ్యూహానికి దీటుగా 'కెనడా స్ట్రాంగ్' నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు.