వివేకా హత్య కేసులో గంగిరెడ్డిని ప్రశ్నిస్తున్న ఈడీ
రిపోర్టర్: అశోక్
స్థలం: Hyderabad
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. హైదరాబాద్లో రెండో రోజు ప్రధాన నిందితుడు గంగిరెడ్డిని ఈడీ అధికారులు దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించినట్లు అధికారులు వెల్లడించారు. హత్యకు ముందు జరిగిన పరిణామాలు, మనీలాండరింగ్ ఆరోపణలు, ఆర్థిక లావాదేవీలపై ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కుట్ర వెనుక అసలు ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో అధికారులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.