మహిళా కండక్టర్ మృతి ఘటన: బాధిత కుటుంబానికి ప్రభుత్వ భారీ పరిహారం

రిపోర్టర్: సునీల్ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన మణుగూరు డిపో మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మరియు పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ ఘటనపై మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధ్యులకు తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.