బెంగళూరులో భార్యను గొంతునులిమి హత్య చేసిన భర్త అరెస్ట్

రిపోర్టర్: రాజేష్ స్థలం: బెంగళూరు

బెంగళూరులోని సంపంగిరామనగర పరిధిలో జరిగిన దారుణ ఘటనలో భార్యను గొంతునులిమి హత్య చేసిన సాగర్ చంద్ర రావత్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. భార్యాభర్తల మధ్య చెలరేగిన వివాదం కారణంగా ఈ హత్య జరిగినట్లు విచారణలో తేలింది. మృతదేహాన్ని మూడు రోజులపాటు ఇంట్లోనే ఉంచుకుని, ఆ తర్వాత ఖాళీ ప్రదేశంలో పడేసినట్లు నిందితుడు అంగీకరించాడని డీసీపీ జి.కె. మిథున్ కుమార్ వెల్లడించారు. క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టి ఈ కేసును ఛేదించామని పోలీసులు స్పష్టం చేశారు.