నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఏపీలో రెండు వేల ఏడు వందల ఇరవై ఒక్క టీచర్ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
రిపోర్టర్: విజయ్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త అందించిందని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. మొత్తం రెండు వేల ఏడు వందల ఇరవై ఒక్క టీచర్ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్ ను బుధవారం అర్ధరాత్రి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల పదకొండు నుంచి ముప్పై వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు, డిసెంబర్ ఇరవై నుంచి జనవరి పదమూడు వరకు ఆన్ లైన్ లో పరీక్షలు జరగనున్నట్లు స్పష్టం చేశారు.