ముంబై సిద్ధివినాయక ఆలయంలో నిర్మాత దిల్ రాజు కుటుంబ దదర్శనం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ముంబై

గణపతి నవరాత్రుల వేళ ప్రముఖ చలనచిత్ర నిర్మాత దిల్ రాజు ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయాన్ని కుటుంబ సమేతంగా సందర్శించారు. తన భార్య తేజస్విని, కుమారుడితో కలిసి వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు దేవుని ఆశీస్సులు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తేజస్విని సోషల్ మీడియాలో షేర్ చేయగా, ప్రస్తుతం ఆ చిత్రాలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.