గ్రామీణ విద్యార్థులకు ఊరట: ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు సైకిళ్ల వితరణ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: భీమిని

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు దాతలు మరియు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలిచాయని అధికారులు తెలిపారు. భీమిని మరియు కన్నెపల్లి మండలాల్లోని వివిధ పాఠశాలల విద్యార్థులకు దాతలు, బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సుమారు నలభై ఎనిమిది సైకిళ్లను పంపిణీ చేశారు. దూర ప్రాంతాల నుంచి నడక ద్వారా రాకపోకలు సాగిస్తున్న విద్యార్థుల కష్టాలు తీర్చేందుకు ఈ సహాయం ఎంతగానో దోహదపడుతుందని స్థానికులు పేర్కొన్నారు.