కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పరుగులు: రూ.లక్ష కోట్లతో రాయలసీమ హబ్

రిపోర్టర్: కిరణ్ స్థలం: అమరావతి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలన్నర రోజుల్లోనే సుమారు రెండు లక్షల పన్నె వేల కోట్ల రూపాయల విలువైన భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టిందని అధికారులు తెలిపారు. సామాజిక పింఛన్ల పంపిణీతో పాటు వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం, పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు నీటి తరలింపు వంటి సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. పల్లెపండుగ కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.