వ్యాపారులకు భారీ ఊరట: జీఎస్టీ అధికారుల అరెస్ట్ అధికారాలు రద్దు
రిపోర్టర్: సురేష్
స్థలం: New Delhi
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథంగా ఉంచాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. వ్యాపారులను వేధింపులకు గురిచేయకుండా ఉండేందుకు ట్యాక్స్ ఆఫీసర్లకు ఉన్న అరెస్ట్ చేసే అధికారాలను కౌన్సిల్ రద్దు చేసింది. అలాగే జీఎస్టీ ఉల్లంఘనలపై ప్రాసిక్యూషన్ ప్రారంభించేందుకు ఉన్న కనీస పరిమితిని కోటి రూపాయల నుంచి ఐదు కోట్ల రూపాయలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు.