రాజాపేటలో రిటైర్డ్ ఉపాధ్యాయుల ఘన సత్కారం
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండలంలో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా నేస్తం ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రిటైర్డ్ ఉపాధ్యాయులను వారి నివాసాలకు వెళ్లి సభ్యులు సన్మానించారు.
బొండుగుల శేషరెడ్డి, రాపోల్ రాంచంద్రారెడ్డి, బిర్రు సుదర్శన్ వంటి విశ్రాంత ఉపాధ్యాయులను సత్కరించి, వారి నుంచి ఆశీర్వాదాలు పొందారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిదని సభ్యులు ఈ సందర్భంగా కొనియాడారు.